కాంగ్రెస్ పార్టీనే హిందూ పార్టీ అని చెప్పా! మరోసారి బండ్ల గణేష్ పవర్ ఫుల్ స్పీచ్

కాంగ్రెస్ పార్టీనే హిందూ పార్టీ అని చెప్పా.. అని ప్రముఖ సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-05-02 10:49 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీనే హిందూ పార్టీ అని చెప్పా.. అని ప్రముఖ సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా మంథనిలో మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ హనుమాన్ చాలీసాతో సభలో స్పీచ్ స్టార్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి మతాన్ని గౌరవిస్తుందని, మా కంటే హిందువులు ఎవరు లేరు.. అని అన్నారు. మీరు హిందూ పేరు చెప్పుకుంటున్నారు.. అణువణువులో మా రక్తంలో హిందుత్వం ఉందని బీజేపీ పై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ నానమ్మను టెర్రరిస్టులు దారుణంగా చంపేశారని గుర్తుచేశారు. ఎన్నో కష్టాలను తట్టుకుని రాహుల్ గాంధీ నిలదొక్కు కున్నారన్నారు.

కాంగ్రెస్ పార్టీ దేశానికి ఎంతో సేవ చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నో ప్రాజెక్టులు కట్టిందని, ఎంతో మంది ప్రజలను ఆదుకుందన్నారు. భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఎమోషన్ అయ్యారు. అంబేడ్కర్ ఆశయాలను నెరవేర్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, ప్రపంచ పటంలో భారత్‌ను నిలబెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం గర్వం, నిజాయితీ అని, నిర్భయంగా తాను కాంగ్రెస్ కార్యకర్తను అని చెప్పుకుంటానని అన్నారు. తాను పట్టింది కాంగ్రెస్ పార్టీ అని, తాను చనిపోయేది కాంగ్రెస్ పార్టీతోనే అని చెప్పారు. ఈ సందర్భంగా పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

Read More..

గ్లాస్ గుర్తుతో..ఊహించని విధంగా పవన్‌కు సపోర్ట్ చేస్తున్న అల్లు అర్జున్! 

Tags:    

Similar News

టైగర్స్ @ 42..