మదర్ డెయిరీ హస్తగతం.. ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ ఫ్యానల్
ఉమ్మడి రంగారెడ్డి, నల్లగొండ జిల్లా పాల ఉత్పత్తి సహకార సంఘం మదర్ డెయిరీ(నార్మూల్) డైరెక్టర్ల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఫ్యానల్ అభ్యర్థులు ఆరుగురు గెలుపొందారు.
దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి రంగారెడ్డి, నల్లగొండ జిల్లా పాల ఉత్పత్తి సహకార సంఘం మదర్ డెయిరీ(నార్మూల్) డైరెక్టర్ల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఫ్యానల్ అభ్యర్థులు ఆరుగురు గెలుపొందారు. కాంగ్రెస్ ప్యానల్ కు చెందిన కల్లెపల్లి శ్రీశైలంకు -222 ఓట్లు, గుడిపాటి మధుసూదన్ రెడ్డి - 229 ఓట్లు, పుష్పాల నర్సింహులుకు - 181.ఓట్లు, బత్తుల నరేందర్ రెడ్డికి - 177 ఓట్లు, రుద్రాల నరసింహ రెడ్డికి - 242 ఓట్లు, మండలి జంగయ్యకు - 237 ఓట్లు సాధించి డైరక్టర్లుగా విజయం సాధించారు. బీఆర్ ఎస్ పార్టీ ప్యానల్ చెందిన ఒగ్గు భిక్షపతికి -71 ఓట్లు, సోమిరెడ్డికి -76, సందిల్ల భాస్కర్ కు - 104, కొండల్ రెడ్డికి - 112, పి గణేష్ కు - 34 ఓట్లు, ఎడ్ల రాంరెడ్డికి - 68 ఓట్లు మాత్రమే రావడంతో వారంతా ఓటమి పాలయ్యారు.
మదర్ డెయిరీ ఎన్నికల్లో క్ల్వీన్ స్వీప్ విజయం సాధించడంతో ఉమ్మడి రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల కాంగ్రెస్ శ్రేణులు, పాడి రైతులు సంబరాలు చేసుకున్నారు. గెలుపొందిన డైరెక్టర్లను ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అభినందించారు. మదర్ డెయిరీ ఎన్నికల్లో మాదిరిగానే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఘన విజయాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.