MLC: కేటీఆర్ ఇతర దేశాలకు పారిపోయే అవకాశం.. వెంటనే పాస్ పోర్టు సీజ్ చేయాలి

ఫార్ములా ఈ కార్ రేసులో విచారణను ఎదుర్కొంటున్న కేటీఆర్ పాస్ పోర్టును సీజ్ చేయాలని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు.

Update: 2025-01-07 15:47 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఫార్ములా ఈ కార్ రేసులో విచారణను ఎదుర్కొంటున్న కేటీఆర్ పాస్ పోర్టును సీజ్ చేయాలని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు. మంగళవారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కేటీఆర్ ఇతర దేశాలకు పారిపోయే అవకాశం ఉన్నందున ఏసీబీ అధికారులు వెంటనే కేటీఆర్ పాస్ పోర్టును సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. దేశం వదిలి తప్పించుకోకుండా చూడాలన్నారు. కేటీఆర్ నిజంగా తప్పు చేయకుంటే లీగల్ టీం ఎందుకు అంటూ ప్రశ్నించారు. కేటీఆర్ కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని బల్మూరి వెంకట్ మండిపడ్డారు. ఏ తప్పు చేయకుంటే కేటీఆర్ విచారణకు ఎందుకు హాజరు కావడం లేదంటూ ఫైర్ అయ్యారు. దోచుకున్న సొమ్మును ప్రజలకు పంచి ప్రజలకు పంచి పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

ఇప్పటికైనా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆలోచించుకోవాలని దొంగలకు అండగా ఉంటారా...? ప్రజల వైపు అండగా నిలబడతారా అనేది తేల్చుకోవాలని సూచించారు. హెచ్ఎండీఏలో ఆస్తులు నీకు, మీ నాన్న కేసీఆర్ అప్పనంగా కట్టబెట్టిండా..? అని ప్రశ్నించారు. రూ.55 కోట్ల ప్రజల సొమ్ము, ప్రభుత్వ ఆస్తిని కాజేసిన దొంగ కేటీఆర్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాధ్యతగల శాసన సభ్యుడిగా తప్పు చేయలేదని నిరూపించుకోవాలని సూచించారు. ప్రజల ఆస్తులను దోచుకున్న ఎంతటి వారినైనా సరే తప్పు చేస్తే వదిలే ప్రసక్తే లేదంటూ బల్మూరి వెంకట్ హెచ్చరించారు.

Tags:    

Similar News