కాంగ్రెస్ ఎమ్మెల్యే ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.. ప్రొఫైల్‌ను మార్చేసిన సైబర్ కేటుగాళ్లు!
ఈ మధ్య సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సామాన్య నెటిజన్ల ఖాతాలే కాకుండా ఏకంగా ప్రజా ప్రతినిధుల సోషల్ మీడియా అకౌంట్‌లను కూడా హ్యాక్ చేస్తున్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ఈ మధ్య సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సామాన్య నెటిజన్ల ఖాతాలే కాకుండా ఏకంగా ప్రజా ప్రతినిధుల సోషల్ మీడియా అకౌంట్‌లను కూడా హ్యాక్ చేస్తున్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ట్విట్టర్ (ఎక్స్) అకౌంట్‌ను హ్యాక్ చేశారు. చైనీస్ అక్షరాలతో ఎమ్మెల్యే ట్విట్టర్ ప్రోఫైల్‌ను మార్చేశారు. ఎమ్మెల్యే బయోలో సైతం పలురకాల ఫేక్ లింక్‌లను పోస్ట్ పెట్టారు.
కాగా, 2015లో వేముల వీరేశం ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేశారు. 2023 డిసెంబర్ వరకు అకౌంట్ యాక్టీవ్‌గా ఉన్నట్లు కనిపించింది. అయితే, ఈ ఎక్స్ ఖాతా హ్యాక్ పై ఎమ్మెల్యే వేముల వీరేశం ఇప్పటి వరకు స్పందించలేదు. కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వేముల వీరేశం బీఆర్ఎస్ పార్టీకి గుడ్‌బై చెప్పి.. కాంగ్రెస్ పార్టీలో చేరి.. నకిరేకల్ టికెట్ దక్కించుకుని ఎమ్మెల్యేగా గెలుపొందిన సంగతి తెలిసిందే.