‘హరీష్ రావు.. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేయండి’
సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లుగా ఆగస్ట్ 15లోపు రైతులకు రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని మాజీ
దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లుగా ఆగస్ట్ 15లోపు రైతులకు రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరిన విషయం తెలిసిందే. తాజాగా హరీష్ రావు సవాల్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పందించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆగస్ట్ 15లోపు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని.. ఛాలెంజ్‌కు కట్టుబడి హరీష్ రావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. స్పీకర్ ఫార్మాట్‌లో హరీష్ రావు రిజైన్ చేయాలని సవాల్ విసిరారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రైతులకు కాంగ్రెస్ రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. గతేడాది డిసెంబర్ 9వ తేదీన మాఫీ చేస్తామని చెప్పగా.. అనివార్య కారణాల వల్ల ప్రభుత్వం చేయలేదు. దీంతో ఆగస్ట్ 15 లోపు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పలుమార్లు బహిరంగంగా ప్రకటించారు.