Sama RamMohan Reddy : ఒక్కొక్కరుగా బయటికి వస్తున్న బీఆర్ఎస్ రాబందులు! : సామ రామ్మోహన్ రెడ్డి

తెలంగాణలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి.

Update: 2024-09-03 10:13 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. వరదల వల్ల ప్రజలు కష్టాల్లో ఉంటే గడీలలో సేదతీరుతున్నారా? అని కాంగ్రెస్ నేతలు నిన్న తీవ్ర విమర్శలు చేశారు. అయితే, ఇవాళ మాజీ మంత్రి హరీష్ రావు ఖమ్మం వరద ప్రాంతాల్లో పర్యటించారు. వరద బాధితులకు ఆహారం, నిత్యావసరాలు వస్తువులను పంపిణీ చేశారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు సైతం వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఎక్స్‌లో టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘సీఎం రేవంత్ రెడ్డి పాలన దెబ్బకి ప్రజల్లో ఉన్న కాస్త గుర్తింపు పోతుందని తప్పక ఒక్కొక్కరుగా బయటికి వస్తున్న పార్టీ రాబందులు. ప్రజలారా జాగ్రత్త. మీ సహాయార్థం పంపిణీ పేరుతో ఫోటోలకు ఫోజులు ఇచ్చి వారే పంచుకు తినే బ్యాచ్ వీళ్ళు. వీరి పంపిణీ (ఏదైనా ఉంటే) పారదర్శకంగా ఉండేలా మీరే చర్యలు తీసుకోండి.’ అని ఎక్స్‌లో రాసుకొచ్చారు.

 


Similar News