ఎమ్మెల్యే రాజయ్యపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్యపై కాంగ్రెస్ నాయకులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

Update: 2023-03-10 13:18 GMT

దిశ, రఘునాథపల్లి: ధర్మసాగర్ మండలం జానకిపురం గ్రామ సర్పంచ్ కురసపల్లి నవ్యను లైంగికంగా వేధింపులకు గురిచేసిన స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాడికొండ రాజయ్యపై కేసు నమోదు చేయాలని కోరుతూ మండల కాంగ్రెస్ నాయకులు, మహిళా సర్పంచులు శుక్రవారం రఘునాథపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బాధ్యతాయుతమైన హోదాలో ఉంటూ మహిళా సర్పంచ్ ని లైంగిక వేధింపులకు గురి చేసిన ఎమ్మెల్యే పై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన వారిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మేకల నరేందర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోళ్ల రవి గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల మహిళా ఉపాధ్యక్షురాలు తుమ్మ విజయమేరి, మండల పార్టీ మహిళా అధ్యక్షురాలు పేర్ని ఉషా రవి,తూడి విజయ సుదర్శన్, సర్పంచ్ బిర్రు లక్ష్మీ, నరసింహులు, మండల పార్టీ ఉపాధ్యక్షులు గుగులోతు కొమురెల్లి,తోటకూరి రమేష్, యాదవ్,మండలపార్టీ ప్రధాన కార్యదర్శి భాస్కర్ యాదవ్, మండల పార్టీ అధికార ప్రతినిధి జీడికంటి రాజ్ కుమార్, పిఎసిఎస్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, వెల్ది వార్డ్ మెంబర్ లావణ్య రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు కుంట కొమురయ్య,తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..