కులగణనతో బండి సంజయ్‌కి వచ్చిన నష్టమేంటి?
కుల గణనతో బండి సంజయ్(Bandi Sanjay)కు ఏమి నష్టమని? కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ లింగం యాదవ్(Lingam Yadav) ప్రశ్నించారు.
దిశ, తెలంగాణ బ్యూరో: కుల గణనతో బండి సంజయ్(Bandi Sanjay)కు ఏమి నష్టమని? కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ లింగం యాదవ్(Lingam Yadav) ప్రశ్నించారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. బీసీలకు న్యాయం జరగాలంటే కుల గణన జరగాలన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పినట్లే, ఇచ్చిన మాటను నిలపెట్టుకుంటున్నామన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం జరగాలంటే కుల గణన జరగాలని రాహుల్ గాంధీ నిర్ణయించారన్నారు. కానీ ఇలాంటి మంచి నిర్ణయంపై కూడా బీజేపీ విమర్శలు సరికాదన్నారు. కులగణన చేస్తామంటే బీజేపీ ఎందుకు భయపడుతుందని ప్రశ్నించారు. బీజేపీ అంటేనే బీసీల వ్యతిరేకమైన పార్టీ అని వెల్లడించారు. బీసీల రిజర్వేషన్ తగ్గడానికి బీఆర్ఎస్ కూడా కారణమన్నారు.
ఓయూ జేఏసీ నేత కోట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. గ్రూప్-1 ఫలితాలు విడుదల చేసి, టీచర్లకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చింది బండి సంజయ్‌కు గుర్తులేదా? అంటూ చురకలు అంటించారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసం బండి సంజయ్, కిషన్ రెడ్డి ఎందుకు పోరాడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల గణన పేరుతో టైం పాస్ చేస్తున్నామని బండి మాట్లాడటం విచిత్రంగా ఉన్నదన్నారు. వర్షాల కారణంగా రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే, కేంద్రం నుంచి నిధులు తీసుకురాకుండా ఎందుకు టైం పాస్ చేశారు? అంటూ ప్రశ్నించారు. పేదలకు మంచి చేయాలని హైడ్రా చేపడుతుంటే, ప్రతిపక్ష పార్టీలు అనవసరంగా పేదలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. జవహర్ నగర్ లో పేదలకు 150 గజాలు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, కానీ బీజేపీ, బీఆర్ఎస్‌లు అడ్డుపడుతున్నాయని వెల్లడించారు. ఈ రెండు పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారాలకు ప్రజలే బుద్ధి చెప్తారని నొక్కి చెప్పారు.