AICC ప్రెసిడెంట్‌గా రాహుల్ గాంధే సరైనోడు: VH

భారత్ జోడో యాత్రతో అట్టడుగు వర్గాల ప్రజలు పడుతున్న బాధలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న రాహుల్ గాంధీ‌నే ఏఐసీసీ అధ్యక్షుడిగా సరైన వ్యక్తి అని మాజీ పీసీసీ అధ్యక్షుడు వీ.హనుమంతరావు వ్యాఖ్యానించారు.

Update: 2022-09-20 15:09 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: భారత్ జోడో యాత్రతో అట్టడుగు వర్గాల ప్రజలు పడుతున్న బాధలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న రాహుల్ గాంధీ‌నే ఏఐసీసీ అధ్యక్షుడిగా సరైన వ్యక్తి అని మాజీ పీసీసీ అధ్యక్షుడు వీ.హనుమంతరావు వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అధినేతను ఎన్నుకొనే (ఏఐసీసీ) షెడ్యూల్ వచ్చిందని, అధ్యక్షుడిగా శశథరూర్ కావచ్చు లేదా అశోక్ గెహ్లాట్ ఎవరైనా కావొచ్చని అన్నారు. రాహుల్ గాంధీ అధ్యక్షుడు అయితే బీజేపీకి ధీటైన నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతారని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పగ్గాలు ఆయన చేపడితే కార్యకర్తల్లో ఉత్సాహం వస్తుందని, అందరూ కలిసి రాహుల్ గాంధీని ఒప్పించాలన్నారు. 'రాహుల్ గాంధీ అవో దేశ్ కా బచావో' అనే నినాదం‌తో ముందుకు పోదామని శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ కూడా ఎవరిని వద్దని అనరని, 'నన్ను ఎవరైనా అంబర్‌పేట్‌లో పోటీ చేస్తావా.. అని అడిగితే నేను వద్దు అంటనా' అని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరుద్యోగులకు నోటిఫికేషన్ ఇవ్వడం లేదన్నారు. కానీ, విదేశాల నుంచి చిరుత పులులు తెప్పించి మధ్యప్రదేశ్‌‌లోని పార్కలో పెట్టారని, అది కూడా మంచిపనేనని అన్నారు. అమిత్ షా రాష్ట్రానికి వచ్చి అసలు ఇక్కడ ఏం జరిగిందో తెలియకుండా ప్రసంగాలు చేసి వెళ్శారని పేర్కొన్నారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..