ఇంటికో ఉద్యోగమని చెప్పి.. ఊరుకో ఉద్యోగం కూడా ఇవ్వలే: MP ఉత్తమ్ ఫైర్

ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌లు నిరుద్యోగ సమస్యలు పరిష్కారించడంలో విఫలం అయ్యారని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు.

Update: 2023-05-06 11:31 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌లు నిరుద్యోగ సమస్యలు పరిష్కారించడంలో విఫలం అయ్యారని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఉద్యోగాలు వస్తాయనే ఆశతో యువత తెలంగాణ కోసం పోరాటం చేశారని గుర్తుచేశారు. కానీ రాష్ట్రం వచ్చిన తర్వాత నిరుద్యోగ సమస్య మరింత పెరిగిందన్నారు. గతంలో 25 లక్షలు నిరుద్యోగులు ఉంటే.. ఉంటే ఇప్పుడు 40 లక్షలకు చేరిందన్నారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న సీఎం కేసీఆర్ ఊరుకో ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. ప్రధాని కూడా సేమ్ అదే ఫాలో అవుతున్నారని, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల భర్తీ అన్నారని, ఏడేళ్ల కాలంలో 18 కోట్ల ఉద్యోగాల భర్తీ చేయాలన్నారు. కానీ మోడీ చేసిన పనులకు చాలా మంది ఉపాధి కోల్పోయారని విమర్శించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. అక్టోబర్ నెలలో ఎన్నికల షెడ్యూల్ వస్తే నవంబర్‌లో ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు. ఏఐసీసీ ఇంచార్జీ మానిక్ రావు థాక్రే మాట్లాడుతూ.. ఉద్యోగ కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ ఆశలను నెరవేర్చలేదన్నారు. ప్రియాంకా గాంధీ సభ ద్వారా ప్రభుత్వం ఉద్యోగ కల్పనలో జరిగిన అన్యాయంపై మాట్లాడుతారని స్పష్టంచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉద్యోగ కల్పనలో ఏం చేయబోతున్నామనేది చెబుతారని అన్నారు.

 Also Read..

ఇందుకేనా తెలంగాణ తెచ్చుకుంది? ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫైర్ 

మత ప్రాతిపదిక రిజర్వేషన్లపై అమిత్ షా సంచలన ప్రకటన 

Tags:    

Similar News