‘రాహుల్‌కు న్యాయం జరుగుతుంది.. ఆ నమ్మకం మాకుంది’
రాహుల్ గాంధీకి న్యాయం జరుగుతుందనే నమ్మకం తమకు ఉన్నదని టీపీసీసీ వైస్‌ప్రెసిడెంట్ మల్లు రవి అన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: రాహుల్ గాంధీకి న్యాయం జరుగుతుందనే నమ్మకం తమకు ఉన్నదని టీపీసీసీ వైస్‌ప్రెసిడెంట్ మల్లు రవి అన్నారు. హైకోర్టులో న్యాయం జరుగుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గురువారం సూరత్ సెషన్స్ కోర్టులో రాహుల్ గాంధీ పిటిషన్‌ను తిరస్కరించిన విషయంపై ఆయన స్పందించారు. సెషన్స్‌కోర్టులో పిటిషన్ తిరస్కరించినా.. హైకోర్టులో న్యాయం జరుగుతుందన్నారు. న్యాయవ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉన్నదన్నారు. మోడీ ఇంటి పేరుగా రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంపై బీజేపీ పరువు నష్టం దావా వేసిన కేసులో రాహుల్‌కు రెండేళ్ల జైల్ శిక్ష వేసిన విషయం విధితమే. ఇదంతా రాజకీయ కుట్రలో భాగంగానే చేస్తున్నారని మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కక్ష్యపూరిత రాజకీయం చేస్తుందని ఫైర్అయ్యారు. రాబోయే ఎన్నికల్లో దేశంలో కాంగ్రెస్‌దే అధికారమని ఆయన స్పష్టం చేశారు.