మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను బర్తరఫ్ చేయండి.. గవర్నర్‌కు కాంగ్రెస్ నేత ఫిర్యాదు
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను తక్షణమే కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌కు కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ సోమవారం ఫిర్యాదు చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను తక్షణమే కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌కు కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ నెల 6వ తేదీన మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ఓ సభలో రాష్ట్రంలో ఉన్న దళితులు 'థర్డ్ క్లాస్' అని అవమానించారని దీనికి మంత్రి కేటీఆరే సాక్ష్యం అని అందువల్ల అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటన జరిగి రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. నేషనల్ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తే ఢిల్లీ నుంచి వచ్చిన కమిషన్ చైర్మన్.. శ్రీనివాస్ గౌడ్ పై తీసుకున్న చర్యలేమిటో చెప్పాలని డీజీపీకి నోటీసు జారీ చేశారని గుర్తు చేశారు. నోటీసులు ఇచ్చినప్పటికీ మంత్రిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, శ్రీనివాస్ గౌడ్ దళితులను అవమానించేలా మాట్లాడారని దుయ్యబట్టారు.
మంత్రి గతంలో ఏసీపీకి పట్టుబడ్డారని, అప్పట్లో చర్లపల్లి జైలులో గడిపాడని ఎనిమిది రోజులు జైలులో ఉన్న శ్రీనివాస్ గౌడ్ ఆఫీసర్‌గా కొనసాగేందుకు అర్హుడే కానప్పటికీ బ్రోకర్ పనులు చేస్తూ ఆయన పదవిలో కొనసాగారన్నారు. దళితులను ఉద్దేశించి శ్రీనివాస్ గౌడ్ అనుచిత వ్యాఖ్యలు చేస్తే బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ఎవరినో ఏదో అంటే స్పందించే నేతలు దళిత మేధావులు మంత్రి ఇంత దారుణంగా మాట్లాడినా ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. దళితులు థర్డ్ క్లాస్ ప్రజలు.. జైల్లో ఉండి వచ్చిన శ్రీనివాస్ గౌడే థర్డ్ క్లాస్ అని ఆరోపించారు.
రాష్ట్రంలో కౌండిన్య గౌడ్లను రాజకీయంగా అణగదొక్కుతున్న వారిలో శ్రీనివాస్ గౌడ్ ఒకరని మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబానికి చెంచాగా పని చేస్తూ అనేక మంది గౌడ్లను రాజకీయంగా, ఆర్థికంగా శ్రీనివాస్ గౌడ్ ఎదగనివ్వడం లేదని ఆరోపించారు. గతంలో ముదిరాజులను సైతం శ్రీనివాస్ గౌడ్ అవమానించారని, ఇప్పుడు దళితులను కించపరిచారని అందువల్ల ఆయన్ను వెంటనే మంత్రి పదవి నుంచి గవర్నర్ తప్పించాలని, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Represented @DrTamilisaiGuv immediate Suspend (Bartaraf) of @VSrinivasGoud earlier was in Jail from Cabinet for his
— Disqualified M.P Supporter Judson Bakka Official (@zson_bakka) May 15, 2023
Abusive speech (Dalithulu 3rd Class) against SC/STs on 6th May 2023 at Devitipalle,Mahabubnager Dist in presence of Minister @KTRBRS@JayGalla @ARBatteriesLtd pic.twitter.com/G2v0zt5wb3