మోడీపై కవిత చేసిన ఆరోపణలు.. కాంగ్రెస్ నేత జడ్సన్ రియాక్షన్ ఇదే!

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీకి మీకు తేడా ఏమీ లేదని సెటైర్లు వేశారు.

Update: 2023-02-20 08:12 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీకి మీకు తేడా ఏమీ లేదని సెటైర్లు వేశారు. గతంలో మోడీపై కవిత చేసిన ఆరోపణలపై జడ్సన్ సోమవారం రియాక్ట్ అయ్యారు. కేంద్రంలో ప్రధాని మోడీ మీడియా గొంతును అణిచివేస్తుంటే చేస్తుంటే రాష్ట్రంలో మీరు మీడియా వాయిస్ ను కొనుగోలు చేస్తున్నారని అందువల్ల కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి తేడా ఏముందని ప్రశ్నించారు. బీబీసీ పై ఐటీ సర్వే నేపథ్యంలో కవిత ఇటీవల ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ 'నిజాలను ప్రజలకు చూపుతున్న మీడియాపై ప్రభుత్వం కక్ష్య సాధింపులకు పాల్పడుతోందని, దర్యాప్తు ఏజెన్సీలను పంపుతోందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై సోమవారం బక్క జడ్సన్ పై విధంగా స్పందించారు.

Tags:    

Similar News