ఎంపీ నామా, ఎమ్మెల్యే రాములు నాయక్​పై హెచ్​ఆర్​సీలో ఫిర్యాదు

బీఆర్ఎస్​పార్టీ ఆత్మీయ సమ్మేళనాల పేరిట ప్రజలను మోసం చేస్తోందని కాంగ్రెస్ ​నేత బక్క జడ్సన్​ పేర్కొన్నారు.

Update: 2023-04-12 14:39 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్​పార్టీ ఆత్మీయ సమ్మేళనాల పేరిట ప్రజలను మోసం చేస్తోందని కాంగ్రెస్​నేత బక్క జడ్సన్​పేర్కొన్నారు. ఆత్మీయం అని మద్యం సమ్మేళనాలు నిర్వహిస్తోందని బుధవారం ఓ ప్రకటనలో ఆరోపించారు. చీమలపాడులో జరిగిన ఘటనలో ఎంపీ నామా నాగేశ్వర్ రావు, ఎమ్మెల్యే రాములు నాయక్ లపై హత్య నేరాలు మోపాలని ఎన్​హెచ్​ఆర్​సీలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఖమ్మం జిల్లా వైరా అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో అధికార బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో అపశృతి చోటు చేసుకోవడం దారుణమన్నారు.

కారేపల్లి మండలం చీమలపాడులో ఈ సమావేశం నిర్వహించగా.. ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాములు నాయకులకు స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు బాణా సంచా పేల్చారని, ఈ సమయంలో నిప్పు రవ్వలు పక్కనే ఉన్న పూరిగుడిసెపై పడ్డాయన్నారు. దీంతో ఇంటికి నిప్పు అంటుకోవటంతో పాటు ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలిపోయిందన్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటికే ఇద్దరు మృతి చెందగా.. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారన్నారు. పేలుడు దాటికి కాళ్లు, చేతులు తెగిపడటం దారుణమన్నారు. వెంటనే ఎంపీ, ఎమ్మెల్యేలను చర్యలు తీసుకోవాలన్నారు.

Also Read..

వారి మరణానికి కల్తీకల్లే కారణమైతే ఎవరినీ వదలం: మంత్రి శ్రీనివాస్ గౌడ్

Tags:    

Similar News