కొల్లాపూర్ సభలో ప్రియాంక గాంధీ ఆ 4 డిక్లరేషన్లు ప్రకటిస్తారు.. మాజీ మంత్రి షబ్బీర్ అలీ
ఈ నెల 30న కొల్లాపూర్ లో కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ సభ ఉంటుందని టీకాంగ్రెస్ తెలిపింది.
దిశ, వెబ్ డెస్క్: ఈ నెల 30న కొల్లాపూర్ లో కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ సభ ఉంటుందని టీకాంగ్రెస్ తెలిపింది. ప్రియాంక సమక్షంలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు తెలిపారు. గాంధీ భవన్ లో పీఏసీ సమావేశం ముగిసిన అనంతరం మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ మీడియాతో మాట్లాడారు. కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ, మాజీ మంత్రి సి.రామచంద్రారెడ్డి మృతి పట్ల పీఏసీలో సంతాపం తెలిపామని చెప్పారు. 4 డిక్లరేషన్ లు పెండింగ్ లో ఉన్నాయని మాజీ మంత్రి షబ్బీర్ అలీ తెలిపారు. డిక్లరేషన్లపై కసరత్తుకు సబ్ కమిటీ వేశామని ఆయన చెప్పారు.
ప్రియాంక సభలో డిక్లరేషన్లు ప్రకటిస్తామని స్పష్టం చేశారు. మణిపూర్ ఘటనను ఖండిస్తున్నామని చెప్పారు. ఖమ్మం సభలో దివ్యాంగులకు కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తే దాన్ని సీఎం కేసీఆర్ అమలు చేశారని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ అన్నారు. త్వరలో బస్సు యాత్రపై నిర్ణయం తీసుకుంటామని మధు ఆయన తెలిపారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై మా పోరాటమని అన్నారు. కాగా ప్రియాంక గాంధీ సభను విజయవంతం చేసేందుకు టీకాంగ్రెస్ నేతలు కసరత్తు చేస్తున్నారు.