రూ.2 లక్షలకు పైగా రుణం తీసుకున్న రైతులకు గుడ్ న్యూ్స్

అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మూడు విడదతల్లో రైతు రుణమాఫీ చేసింది. మొదటి విడతలో రూ.1 లక్ష, రెండో విడతలో రూ.1.50 లక్షలు, మూడో విడతలో రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసింది.

Update: 2024-08-17 12:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మూడు విడదతల్లో రైతు రుణమాఫీ చేసింది. మొదటి విడతలో రూ.1 లక్ష, రెండో విడతలో రూ.1.50 లక్షలు, మూడో విడతలో రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసింది. ప్రస్తుతం రెండు లక్షలకు పైగా రుణం తీసుకున్న రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రెండు లక్షలకు పైగా ఉన్న రైతు రుణాలను కూడా మాఫీ చేయబోతోందని కిసాన్‌ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి తెలిపారు. అర్హులై ఉండి రుణమాఫీ కాకపోతే జిల్లాల్లోని నోడల్ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని సీఎం కేబినెట్ మీటింగ్‌లో మంత్రులకు చెప్పారని గుర్తుచేశారు. కేటీఆర్‌కు అనుభవం లేక రైతుల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని కోదండరెడ్డి మండిపడ్డారు. ఇంకా రుణమాఫీ ప్రక్రియ పూర్తి కాలేదని, రెండు లక్షల పైన ఉన్న రైతులకు కూడా మాఫీ చేయాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు.

Tags:    

Similar News