తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం.. షర్మిల రియాక్షన్ ఇదే..!
తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వేళ కాంగ్రెస్ పార్టీకి వైఎస్సాఆర్ టీపీ పార్టీ చీఫ్ షర్మిల శుభాకాంక్షలు తెలిపారు.
దిశ, వెబ్డెస్క్: తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వేళ కాంగ్రెస్ పార్టీకి వైఎస్సాఆర్ టీపీ పార్టీ చీఫ్ షర్మిల శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా ఆమె స్పందిస్తూ.. ‘తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీకి ఇదే మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. పదేండ్ల నియంత పాలనను నిలువునా పాతిపెడుతూ, మీ మీద నమ్మకంతో, సరికొత్త ఆశలతో కాంగ్రెస్కు పట్టం కడుతూ తెలంగాణ ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు ఒక అద్భుతం ఐతే, ఇప్పుడు ఏర్పాటు చేసిన ప్రజా ప్రభుత్వం మరొక్క మహత్తర ఘట్టం, ఇది సుపరిపాలనకు నాంది అని కూడా మేము ఆశిస్తున్నాం.
ప్రజల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా, నిబద్ధత, నిస్పాక్షికతకు మారుపేరుగా ఈ సర్కారు ఉండబోతోంది. ఇది నూటికి నూరు శాతం నాలుగు కోట్ల ప్రజల నమ్మకం. వైఎస్సార్ తెలంగాణ పార్టీ తరఫున కాంగ్రెస్ సర్కారుకు ఎల్లవేళలా సహకారం, మద్ధతు, మనస్ఫూర్తిగా అందించడానికి మేము సిద్ధమే అని సంతోషంగ తెలియజేస్తున్నాం. ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి అనుముల మరియు టీం కాంగ్రెస్ నాయకులకు మా శుభాకాంక్షలు.’ అని షర్మిల స్పందించారు. తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు చీలొద్దనే ఉద్దేశంతో షర్మిల పోటీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి షర్మిల మద్దతు ప్రకటించారు.