Congress : మళ్లీ తెలంగాణలో గాడిద గుడ్డు పోస్టర్ల హల్‌చల్

పార్లమెంట్ ఎన్నికల సమయంలో తెలంగాణకు పదేండ్లుగా అధికారంలో వున్న మోడీ సర్కార్.. చేసింది ఏమి లేదని, గాడిద గుడ్డని ప్రచారం చేసిన కాంగ్రెస్ మళ్లీ నిన్న పార్లమెంట్ బడ్జెట్‌లో తెలంగాణకు మోడీ సర్కార్ ఏమి ఇవ్వలేదంటూ ఫైర్ అయింది.

Update: 2024-07-24 10:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల సమయంలో తెలంగాణకు పదేండ్లుగా అధికారంలో వున్న మోడీ సర్కార్.. చేసింది ఏమి లేదని, గాడిద గుడ్డని ప్రచారం చేసిన కాంగ్రెస్ మళ్లీ నిన్న పార్లమెంట్ బడ్జెట్‌లో తెలంగాణకు మోడీ సర్కార్ ఏమి ఇవ్వలేదంటూ ఫైర్ అయింది. తెలంగాణ నుండి 8 ఎంపీ సీట్లను గెలిపిస్తే.. రాష్ట్రానికి మోడీ సర్కార్ గాడిద గుడ్డు ఇచ్చిందంటూ సిటీలోని పలు బస్ స్టాప్‌లలో పోస్టర్లు వెలిశాయి. గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు బస్టాండ్లకు హోర్డింగ్‌లకు గాడిద గుడ్డు పోస్టర్లు దర్శనమిచ్చాయి. అయితే ఎంపీ ఎలక్షన్ క్యాంపెయిన్‌లో గాడిద గుడ్డును ప్రధానంగా వాడుకోగా మళ్లీ ఈ అంశం తెరపైకి రావడం ఆసక్తిగా మారింది.

Tags:    

Similar News