కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై సీఈవోకు కాంగ్రెస్ ఫిర్యాదు
కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డిపై టీ-కాంగ్రెస్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్‌కు ఫిర్యాదు చేసింది. ఓటు వేసిన అనంతరం
దిశ, వెబ్‌డెస్క్: కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డిపై టీ-కాంగ్రెస్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్‌కు ఫిర్యాదు చేసింది. ఓటు వేసిన అనంతరం ఎన్నికల ప్రవర్తన నియామవళికి విరుద్ధంగా ప్రధాని మోడీ పేరును కిషన్ రెడ్డిని ప్రస్తావించారని కంప్లైంట్ చేసింది. ఇలా మాట్లాడటం ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించడమేనని, కిషన్ రెడ్డిపై కోడ్ ఉల్లంఘన కింద కేసు నమోదు చేయాలని సీఈవోను కోరింది. కాగా, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బర్కత్‌పురాలో ఇవాళ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగానే మోడీ పేరు ప్రస్తావించారని కాంగ్రెస్ సీఈవోకు ఫిర్యాదు చేసింది. ఇక, తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలు కాగా.. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ బూత్‌లకు క్యూ కట్టారు. ఓటర్ల కిటకిటతో పోలింగ్ బూత్‌లలో పండుగ వాతావరణం నెలకొంది. ఇక, సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.