నా పర్సనల్ లైఫ్ బయటకు తీస్తున్నరు.. కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య ఆసక్తికర వ్యాఖ్యలు
బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యకు వరంగల్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థిగా టికెట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యకు వరంగల్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థిగా టికెట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కడియం కావ్య తాాజాగా ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది తన ఫస్ట్ పొలిటికల్ ఎంట్రీ అని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి లేకపోయిన పిలిచి టికెట్ ఇచ్చారన్నారు. కానీ బీఆర్ఎస్‌లో లోకల్ మాజీ ఎమ్మెల్యేలు, లీడర్లు సహకరించలేదని తెలిపారు. అందుకే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చామన్నారు.
నేను వాళ్ళ చుట్టూ ప్రదక్షిణలు చేయలేదు
కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానం తనకు ఇక్కడ నుంచి రాలేదన్నారు. ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, అగ్రనేతల ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. కానీ వారి చూట్టు కావాలని ప్రదక్షిణలు చేయలేదన్నారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ దీపాదాస్ మున్షీ, టీపీసీసీ ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారని తెలిపారు.
మరోవైపు మతాంతర వివాహంపై కడియం కావ్వ స్పందించారు. ఇతర మతం వారిని మ్యారెజీ చేసుకున్నంత మాత్రాన కులం అనేది మారదన్నారు. తనది ఎస్సీ వర్గమేనని, కావాలనే ప్రజలను కన్ఫ్యూజ్ చేయడానికి లేనిపోని ఆరోపణలు తనపై క్రియేట్ చేస్తున్నారని తెలిపారు. తమపై భూ కబ్జాలు, రౌడియిజం, అవినీతి లాంటివి చెప్పడానికి ఏమీ లేవు కాబట్టి.. అందుకే తన పర్సనల్ లైఫ్‌ను బయటకు తీసుస్తున్నారని చెప్పారు.