Congress: బీఆర్ఎస్ అంటేనే బొందలగడ్డ పార్టీ.. కాంగ్రెస్ నేత మందుల సామేల్ ఫైర్

తెలంగాణ ప్రకటించాక కేసీఆర్ కుటుంబం(CR Family) సోనియా గాంధీ(Sonia Gandhi)ని కలిసింది మరిచిపోయారా..? అని తుంగతుర్తి ఎమ్మెల్యే(Thungaturthi MLA) మందుల సామేల్(Mandhula Samelu) ప్రశ్నించారు.

Update: 2024-12-13 09:40 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రకటించాక కేసీఆర్ కుటుంబం(CR Family) సోనియా గాంధీ(Sonia Gandhi)ని కలిసింది మరిచిపోయారా..? అని తుంగతుర్తి ఎమ్మెల్యే(Thungaturthi MLA) మందుల సామేల్(Mandhula Samelu) ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ(Congress Party) ఇచ్చిన మాట మీద చివరి వరకు నిలబడే పార్టీ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మీద అబండాలు వేసేందుకు బీఆర్ఎస్ నాయకులు(BRS Leaders) పోటీ పడుతున్నారని మండిపడ్డారు. ఇవాళ కవిత(Kavitha) కూడా తెర మీదకి వచ్చి, వారితో పోటీ పడి దుష్ప్రచారాలు చేస్తుందని అన్నారు. మీ పాలనలో మీ కుటుంబానికి మాత్రమే అధికారం ఉండేదని, కాంగ్రెస్ పాలనలో మంత్రి వర్గం మొత్తానికి సమాన అధికారాలు ఉన్నాయని చెప్పారు.

బీఆర్ఎస్ పార్టీ ముగ్గురు, నలుగురికి తప్ప వేరే వాళ్లకు ప్రెస్ మీట్ పెట్టే అధికారం కూడా లేదని, కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే గా ఉన్న తనకు కూడా ప్రెస్ మీట్ పెట్టే స్వేచ్ఛ ఉంటుందని చెప్పారు. తెలంగాణ పేరుతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో వచ్చాక టీఆర్ఎస్(TRS) ను బొంద పెట్టి, బీఆర్ఎస్ ను తెచ్చుకున్నారని, బీ అంటే బొందలగడ్డ పార్టీ అని, ఆ పేరు పెట్టి మీ బొంద మీరే తీసుకున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా ఎందుకు మార్చారో చెప్పాలని, కేసీఆర్ కుటుంబం వెళ్లి సోనియా గాంధీని ఎందుకు కలిశారో హరీష్ రావు చెప్పాలని ప్రశ్నించారు. అంతేగాక కాంగ్రెస్ పార్టీ బీఫాం మీద గెలిచిన వాళ్లనే మంత్రులను చేస్తే.. బీఆర్ఎస్ చేతికి దొరికిన వాళ్లని మంత్రులను చేసిందని ఆరోపించారు. ఇక కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేయలేదని, బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే ముందు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలని హెచ్చరించారు. 

Tags:    

Similar News