MLA దానం నాగేందర్‌పై స్పీకర్‌కు ఫిర్యాదు
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల బృందం హైదరాబాద్ హైదర్‌గూడలోని స్పీకర్ నివాసానికి వెళ్లారు.
దిశ, వెబ్‌డెస్క్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల బృందం హైదరాబాద్ హైదర్‌గూడలోని స్పీకర్ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా పార్టీ ఫిరాయించిన దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని పిటిషన్‌ను స్పీకర్‌కు అందజేశారు. అయితే, నిన్ననే దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే.
సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఏఐసీసీ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ దానంతో పాటు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డికి కూడా హస్తం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే, దానంకు మంత్రి పదవి రాబోందనే వార్తలు సోషల్ మీడియాలో విస్తృతం అయ్యాయి. హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే ఆయనే కావడంతో జిల్లా నుంచి ప్రతినిధిగా ఆయనకు మంత్రి పదవి ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు దానం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నట్లు తెలుస్తోంది.