Lagacharla victims : ఎస్సీ, ఎస్టీ కమిషన్ కు లగచర్ల బాధితుల ఫిర్యాదు

కొడంగల్ నియోజకవర్గం లగచర్ల దాడి కేసు బాధితులు(Lagacharla victims)ఎస్సీ, ఎస్టీ కమిషన్ (SC and ST Commission)ను కలిసి పోలీసుల తీరుపై ఫిర్యాదు చేశారు.

Update: 2024-11-16 07:16 GMT

దిశ, వెబ్ డెస్క్ : కొడంగల్ నియోజకవర్గం లగచర్ల దాడి కేసు బాధితులు(Lagacharla victims)ఎస్సీ, ఎస్టీ కమిషన్ (SC and ST Commission)ను కలిసి పోలీసుల తీరుపై ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన పలువురు బాధితులు బీఆర్ఎస్ నేతలతో కలిసి ఎస్సీ, ఎస్టీ కమిషన్ ను కలిసి పోలీసులు వారిపై చేసిన దాడిపై ఫిర్యాదు చేశారు. పోలీసులు తమ పట్ల దౌర్జన్యకరంగా అసభ్యంగా ప్రవర్తించారని బాధితులు మహిళలు ఫిర్యాదు చేశారు. కాగా మహిళా అధికారిణితో బాధిత మహిళల నుంచి స్టేట్మెంట్ తీసుకోవాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కమిషన్ ను కోరారు. అందుకు ఎస్సీ ఎస్టీ కమిషన్ అంగీకరించింది. బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని  బీఆర్ఎస్ నాయకులు కమిషన్ ను కోరారు.

కమిషన్ చైర్మన్ వెంకటయ్య మాట్లాడుతూ త్వరలో లగచర్ల గ్రామంలో పర్యటిస్తామని తెలిపారు. అసభ్యంగా ప్రవర్తించిన పోలీసులను విచారిస్తామని, దోషులను కమీషన్ వదిలిపెట్టదని హామీ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీలకు కమిషన్ అండగా ఉంటుందన్నారు. ఫార్మా కంపెనీకి కమిషన్ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అధికారులపై జరిగిన దాడులను ఖండిస్తున్నామని, భూములు కోల్పోతున్న ప్రజలకు న్యాయం చేయాల్సిందేనన్నారు. 

Tags:    

Similar News