TS: గ్రూప్-1 పరీక్షను వాయిదా వేయండి

జూన్​11న జరుగనున్న గ్రూప్​-1 ప్రిలిమ్స్​పరీక్షను వాయిదా వేయాలంటూ 36 మంది అభ్యర్థులు మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Update: 2023-05-23 15:18 GMT

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: జూన్​11న జరుగనున్న గ్రూప్​-1 ప్రిలిమ్స్​పరీక్షను వాయిదా వేయాలంటూ 36 మంది అభ్యర్థులు మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని స్వీకరించిన న్యాయస్థానం ఈనెల 25న విచారణ జరపాలని నిర్ణయించింది. టీఎస్పీఎస్సీ బోర్డు పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ నేపథ్యంలో గతంలో నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్​పరీక్షను బోర్డు అధికారులు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఒకవైపు మెయిన్స్‌కు ప్రిపేర్​అవుతుండగా జరిగిన ఈ పరిణామాలతో అభ్యర్థులు మానసికంగా కుంగిపోయారు.

కాగా, గ్రూప్-1 ప్రిలిమ్స్​పరీక్షను జూన్​11న నిర్వహించాలని నిర్ణయించిన బోర్డు ఈ మేరకు నోటిఫికేషన్​కూడా జారీ చేసింది. కాగా, దీనిని ఆపివేయాలని అభ్యర్థిస్తూ 36 మంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్​వేశారు. ప్రశ్నాపత్రాల లీకేజీ తదనంతర పరిణామాల నేపథ్యంలో తాము ప్రిలిమ్స్​పరీక్షకు పూర్తిస్థాయిలో సన్నద్ధం కాలేదని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. పరీక్ష నిర్వహణను వాయిదా వేసేలా బోర్డుకు ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించారు. దీనిని స్వీకరించిన హైకోర్టు ఈనెల 25న జరుపనుంది.

Tags:    

Similar News