తెలంగాణ మహిళల భద్రతకు ముప్పు.. ట్యాపింగ్‌కు గురైన 4 లక్షల సిమ్‌లు
శ్రీనిధి ఎండీ జీ.విద్యాసాగర్ రెడ్డిపై కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ జాతీయ మహిళా కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
దిశ, వెబ్‌డెస్క్: శ్రీనిధి ఎండీ జీ.విద్యాసాగర్ రెడ్డిపై కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ జాతీయ మహిళా కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళలు తమ జీవనోపాధి కోసం మహిళా సంఘాలను ఏర్పాటు చేసుకొని శ్రీనిధి ద్వారా రుణాలు పొందుతున్నారని అన్నారు. దీనిని ఆసరాగా చేసుకున్న శ్రీనిధి ఎండీ జీ.విద్యాసాగర్ రెడ్డి మహిళలను అగౌరవ పరుస్తూ వారి పర్సనల్ జీవితాలలో కూడా స్వేచ్ఛ లేకుండా చేస్తున్నాడని మండిపడ్డారు. సుమారు 4 లక్షల సిమ్ కార్డులను కొనుగోలు చేసి.. మహిళా సంఘాల ద్వారా వాటిని మహిళలకు చేర్చి.. ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడి.. వారి పర్సనల్ జీవితాలలో కూడా స్వేచ్ఛ లేకుండా చేశాడని ఆరోపించారు. ఈ విషయమై శుక్రవారం పూర్తి ఆధారాలతో రాష్ట్రంలో ఫిర్యాదు చేయడమే కాకుండా జాతీయ మహిళా కమిషన్లో కూడా ఫిర్యాదు చేశారు.