కామారెడ్డి రైతులకు కలెక్టర్ భరోసా
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై రైతుల ఆందోళన నేపథ్యంలో శనివారం కలెక్టర్ జీతేష్ వీ పాటిల్ మీడియా సమావేశం నిర్వహించారు.
దిశ, వెబ్ డెస్క్: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై రైతుల ఆందోళన నేపథ్యంలో శనివారం కలెక్టర్ జితేష్ వీ పాటిల్ మీడియా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ఇచ్చింది డ్రాఫ్ట్ ప్లాన్ మాత్రమే అన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మాస్టర్ ప్లాన్‌పై అభ్యంతరాలు చెప్పొచ్చన్నారు. ఇప్పటివరకు 1026 అభ్యంతరాలు వచ్చాయన్నారు. జనవరి 11 వరకు అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం ఉందన్నారు. భూములు పోతాయనే భయం రైతులకు వద్దన్నారు. పంట పొలాల్లో ఇండస్ట్రీయల్ జోన్ పెట్టడం లేదు. ముసాయిదాలో మార్పులు, చేర్పులు జరుగుతాయన్నారు. ఇండస్ట్రీయల్ జోన్ అంటే భూసేకరణ కాదన్నారు. నిబంధనల ప్రకారమే కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందిచామన్నారు. భూములు పోతాయన్నది తప్పుడు సమాచారమే అన్నారు. మాస్టర్ ప్లాన్ పై 60 రోజుల్లో సలహాలు, సూచనలు ఇవ్వొచ్చని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రచారం చేశామన్నారు. రైతులకు అనుమానాలుంటే కలెక్టర్ ఆఫీస్‌లో నివృత్తి చేస్తామన్నారు. ప్రభుత్వ ఆస్తులపై దాడులు చేయడం సరికాదన్నారు. అలా చేస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.