రైతు భరోసా అమలుపై సీఎం కీలక వ్యాఖ్యలు

78వ స్వాత్రంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. సీఎం హోదాలో రెవండ్ రెడ్డి గోల్కొండలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.

Update: 2024-08-15 06:07 GMT

దిశ, వెబ్ డెస్క్: 78వ స్వాత్రంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. సీఎం హోదాలో రెవండ్ రెడ్డి గోల్కొండలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం సమావేశంలో ఈయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజల చేత, ప్రజల కొరకు.. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉందని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రజలకు రేషన్‌ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ సేవలు, మహాలక్ష్మి పథకం, గృహజ్యోతి, రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు పంపిణీ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. అలాగే రైతులకు రూ.2 లక్షల వరకూ రుణమాఫీ చేస్తున్నామని ధరణి సమస్యలపై మా ప్రభుత్వం దృష్టి సారించిందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు. అలాగే రాష్ట్రంలో త్వరలోనే అర్హులైన రైతులందరికి రైతు భరోసా అందిస్తామని, దీనికి సంబంధించిన విదివిధానాలను ప్రభుత్వం అధికారులు తయారు చేస్తున్నారని.. పూర్తి ప్రణాళిక సిద్ధం కాగానే రైతు భరోసా అందిస్తామని గోల్కొండ కోట సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డీ హామీ ఇచ్చారు. 

Tags:    

Similar News