CM రేవంత్ కూతురు నైమిషా రెడ్డి గొప్ప మనసు.. IPL మ్యాచ్‌కు ఆ 30 మంది
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచి మనసుచాటుకున్నారు. 30 మంది అనాథ పిల్లల కోరిక నెరవేర్చారు. బీఎన్ రెడ్డి, సేఫ్ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎల్బీనగర్‌లోని ఓ అనాథ ఆశ్రమానికి చెందిన చెందిన 30 మంది పిల్లలను ఉప్పల్ మైదానంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌కు పంపించారు.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచి మనసుచాటుకున్నారు. 30 మంది అనాథ పిల్లల కోరిక నెరవేర్చారు. బీఎన్ రెడ్డి, సేఫ్ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎల్బీనగర్‌లోని ఓ అనాథ ఆశ్రమానికి చెందిన చెందిన 30 మంది పిల్లలను ఉప్పల్ మైదానంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌కు పంపించారు. సీఎం రేవంత్ రెడ్డి కూతురు నైమిషా రెడ్డి అనాథ పిల్లలను స్వయంగా మైదానానికి తీసుకెళ్లినట్లు సమాచారం. కాగా, ఇవాళ ఐపీఎల్‌లో భాగంగా ఉప్పల్ మైదానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో లక్నో టాస్ గెలిచింది. దీంతో హైదరాబాద్ ముందుగా బౌలింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌లో క్వింటన్ డి కాక్ తిరిగి ప్లేయింగ్-11కి చేరుకోగా, మోహ్సిన్ ఖాన్ గాయం కారణంగా ఆడడం లేదు. మరోవైపు హైదరాబాద్‌లో రెండు మార్పులు చేసింది. సన్వీర్ సింగ్, విజయకాంత్‌లకు అవకాశం దక్కింది. విజయకాంత్ అరంగేట్రం చేస్తున్నారు.