New Osmania Hospital: కొత్త ఉస్మానియా ఆసుపత్రి శంకుస్థాపన.. అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష

ఈ నెలాఖరులోగా ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.

Update: 2025-01-11 09:03 GMT
New Osmania Hospital: కొత్త ఉస్మానియా ఆసుపత్రి శంకుస్థాపన.. అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ఈ నెలాఖరులోగా ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) అధికారులకు సూచించారు. కొత్త ఉస్మానియా ఆసుపత్రి (New Osmania Hospital) నిర్మాణంపై ఇవాళ(శనివారం) అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. గోషామహల్‌లో ప్రతిపాదిత స్థలానికి సంబంధించి శాఖల మధ్య భూ బదలాయింపు ప్రక్రియ, ఇతర పనులను వీలైనంత వేగంగా పూర్తి చేయాలని ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు.

ప్రతిపాదిత స్థలంలో చేపట్టాల్సిన ఉస్మానియా ఆసుపత్రి, ఇతర నిర్మాణాలకు సంబంధించి నమూనా మ్యాప్ లను సీఎంకు అధికారులు వివరించారు. నిర్మాణంలో పలు మార్పులు, చేర్పులను ముఖ్యమంత్రి సూచించారు. రోడ్లు, పార్కింగ్, మార్చురీ, ఇతర మౌలిక సదుపాయాల విషయంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని నమూనాలను రూపొందించాలని సీఎం అధికారులకు సూచించారు.

Tags:    

Similar News