రైతులను ఇబ్బంది పెట్టొద్దు.. బ్యాంకులకు CM రేవంత్ రెడ్డి హెచ్చరిక

చ్చిన మాట ప్రచారం ఆగష్టు 15వ తేదీన రుణమాఫీ చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ప్రకటించారు.

Update: 2024-04-23 11:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇచ్చిన మాట ప్రచారం ఆగష్టు 15వ తేదీన రుణమాఫీ చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ప్రకటించారు. మంగళవారం నారాయణపేట జిల్లా మద్దూరులో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులు ఎవరూ అధైర్య పడొద్దని సూచించారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు రాజకీయంగా లబ్ధి పొందేందుకు వంద మాటలు చెబుతారని అవన్నీ నమ్మొద్దని అన్నారు. తప్పకుండా రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని ప్రకటించారు. బ్యాంకులు రైతులను ఇబ్బంది పెట్టొద్దని.. రుణమాఫీ చేసే బాధ్యత నాది అని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.

అందరూ వరి పండించండి.. చివరి గింజ వరకూ కొంటామని భరోసా ఇచ్చారు. గతంలో వరి వేశాక కొనుగోలు చేశాక రైతులను ఇబ్బంది పెట్టారని గుర్తుచేశారు. తాను రుణమాఫీ చేసిన మరుక్షణమే కేసీఆర్ బీఆర్ఎస్‌ను రద్దు చేస్తారా? అని సూటిగా ప్రశ్నించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో 5 గ్యారంటీలను వంద రోజుల్లోనే అమలు చేశామని అన్నారు. కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉన్నా.. ఒక్క హామీని కూడా అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. గతంలో కేసీఆర్ చేసిన రుణమాఫీ వడ్డీకే సరిపోలేదని అన్నారు. కేసీఆర్ చేసిన అప్పులను ఇప్పటికే రూ.24 వేలు చెల్లించనట్లు పేర్కొన్నారు.

Tags:    

Similar News