రెండు పార్లమెంట్ స్థానాలు గెలవాలే.. ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి కీలక సూచన

వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రెండు లోక్‌సభ స్థానాలను గెలిచి సత్తా చాటాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేశారు.

Update: 2024-01-09 04:53 GMT

దిశ బ్యూరో, మహబూబ్ నగర్: వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రెండు లోక్‌సభ స్థానాలను గెలిచి సత్తా చాటాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం హైదరాబాదులోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్ర భవనంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఉమ్మడి పాలమూరు జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు ఎన్నం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, జి.మధుసూదన్ రెడ్డి, అనిరుద్ రెడ్డి, శ్రీహరి, కూచుకుల్ల రాజేష్ రెడ్డి, చిట్టెం పర్ణిక రెడ్డి, ఈర్లపల్లి శంకర్, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన నియోజకవర్గాలలో ఉన్న ప్రధాన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ సమస్యలను విడతల వారీగా పరిష్కరిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నియోజకవర్గాల అభివృద్ధికి త్వరలోనే రూ.10 కోట్ల రూపాయలను కేటాయిస్తామని ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య మరింత సమన్వయం పెంచి వాటిని మరింత బలోపేతం చేయాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ రిపీట్ చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News