BREAKING: రైతులకు స్వీట్ న్యూస్.. రూ.2 లక్షల రుణమాఫీపై CM రేవంత్ కీలక ప్రకటన

రూ.2 లక్షల రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ భేటీలో పంట రుణమాఫీ విధివిధానాలపై చర్చించామని.. అసెంబ్లీ

Update: 2024-06-21 13:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: రూ.2 లక్షల రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం జరిగిన కేబినెట్ భేటీలో పంట రుణమాఫీ విధివిధానాలపై చర్చించామని.. అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని మంత్రి మండలి సమావేశంలో నిర్ణయించామని తెలిపారు. కేబినెట్ భేటీ అనంతరం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘వ్యవసాయాన్ని పండుగ చేయడం కాంగ్రెస్ పార్టీ విధానం. కాంగ్రెస్ మాట ఇస్తే వెనకడుగు వేయదు. పార్టీకి నష్టమని తెలిసిన సోనియా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. సోనియా గాంధీ మాట ఇస్తే శిలాశాసనమే.

2022 మే 6న జరిగిన వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ హామీ ఇచ్చారు. రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని అమలు చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. గత ప్రభుత్వం 2014, 2018లో రుణమాపీ చేసింది. రెండు టర్ముల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం రూ.28 వేల కోట్లు రుణమాఫీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం.. 2018 డిసెంబర్ 12 నుండి 2023 డిసెంబర్ 9 మధ్య తీసుకున్న రుణాలను మాఫీ చేస్తోంది. రుణమాఫీ కోసం రూ.31 వేల కోట్లు అవసరం అవుతాయని అంచనా. ఏక కాలంలో రూ.2 లక్షలు మాఫీ చేస్తాం’’ అని రేవంత్ రెడ్డి వెల్లడించారు.  


Similar News