ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ

ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సబ్ కమిటీలతో సచివాలయంలో కీలక సమావేశం కొనసాగిస్తున్నారు.

Update: 2024-10-09 09:23 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సబ్ కమిటీలతో సచివాలయంలో కీలక సమావేశం కొనసాగిస్తున్నారు. ఈ సమావేశానికి ఆయా సబ్ కమిటీలకు చెందిన మంత్రులు దామోదర రాజనర్సింహ, ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, సీతక్క, ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ అమలుకు న్యాయ పరమైన చిక్కులు రాకుండా జ్యూడీషియల్ కమిటీ వేయాలని సబ్ కమిటీ నిర్ణయించింది.

ఈ అంశంతో పాటు కమిటీకి ప్రజా సంఘాల నుంచి వచ్చిన 1082అభిప్రాయాలు, జిల్లాల పర్యటన అంశాలు, ఇతర రాష్ట్రాలు, జిల్లాల పర్యటన అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో చర్చిస్తారు. అలాగే బీసీ కుల గణనలో ఎలా ముందుకెళ్ళాలన్నదానిపై సమావేశంలో చర్చించి నిర్ణయించనున్నారు. 

Similar News