CM Revanth: బర్త్ డే వేడుకలు ముగిసిన వెంటనే అక్కడికి సీఎం రేవంత్.. రెండు రోజులు పాటు మకాం
త్వరలో మహారాష్ట్ర ఎన్నికల ప్రచారా(Maharashtra Election Campaign)నికి సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) వెళ్లనున్నట్టు తెలుస్తున్నది.
దిశ, తెలంగాణ బ్యూరో: త్వరలో మహారాష్ట్ర ఎన్నికల ప్రచారా(Maharashtra Election Campaign)నికి సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) వెళ్లనున్నట్టు తెలుస్తున్నది. ప్రధానంగా ముంబైలో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో ఆయన పర్యటించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. మహారాష్ట్ర ఎన్నికల స్టార్ క్యాంపెయినర్(Election star campaigner) లిస్టులో రేవంత్‌రెడ్డి పేరును ఇప్పటికే ఏఐసీసీ(AICC) ప్రకటించింది. దీనితో ఆయన ఎన్నికల ప్రచార షెడ్యూలును ముంబై కాంగ్రెస్ కమిటీ(Mumbai Congress Committee) రెడీ చేసినట్టు పార్టీ వర్గాల్లో టాక్ ఉంది. కనీసం రెండు రోజుల పాటు రేవంత్ అక్కడే ఉండి, కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేయనున్నట్టు సమాచారం.
బర్త్ డే తర్వాత సీఎం ముంబై పర్యటన
ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) బర్త్ డే. ఆ రోజు ఆయన మూసీ పరివాహాక ప్రాంతం భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని బొల్లపల్లి గ్రామంలో పాదయాత్ర చేయనున్నారు. వీలైతే తెల్లారి లేదా మరునాడు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్తారని రేవంత్‌కు సన్నిహితంగా ఉండే ఓ మంత్రి వివరించారు. మహారాష్ట్రలో 16 అసెంబ్లీ సెగ్మెంట్లలో తెలుగు ప్రజలు అత్యధికంగా నివాసం ఉంటున్నారు. కాగా, రేవంత్ మాత్రం ముంబై పరిసరాల్లోని సెగ్మెంట్లలోనే ఎక్కువగా ప్రచారం చేయనున్నట్టు తెలుస్తున్నది. మిగతా నియోజకవర్గాల్లో మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు వెళ్లి ప్రచారం చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల పరిశీలకుడిగా ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి రెగ్యులర్‌గా ఆయనకు అప్పగించిన సెగ్మెంట్లలో ప్రచారం కొనసాగిస్తున్నారు.