బాలయ్య ‘అన్‌స్టాపబుల్ షో’కు CM రేవంత్ రెడ్డి.. రికార్డులు బద్దలవడం ఖయమా?
బుల్లితెరపై సందడి చేయడానికి నటసింహం నందమూరి బాలకృష్ణ మరోసారి సిద్ధమయ్యారు. ఇప్పటికే మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసిన ఆయన.. నాలుగో సీజన్లో అంతకు మించిన ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి రెడీ అయినట్లు తెలుస్తున్నది.
దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెరపై సందడి చేయడానికి నటసింహం నందమూరి బాలకృష్ణ మరోసారి సిద్ధమయ్యారు. ఇప్పటికే మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసిన ఆయన.. నాలుగో సీజన్లో అంతకు మించిన ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి రెడీ అయినట్లు తెలుస్తున్నది. సెకండ్ సీజన్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు, సీజన్-3 లో పవర్ స్టార్ పపన్ కల్యాణ్‌తో రికార్డులన్నీ తిరగరాశారు. ఈసారి మరింత సర్ప్రైజింగ్గా ఎవరూ ఊహించని అతిథులను పిలిచి ఫ్యాన్స్‌కు కిక్కివ్వాలని నిర్వహకులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు కీలకంగా వినిపిస్తోంది. గతంలో రేవంత్ రెడ్డి, బాలయ్య ఇద్దరూ టీడీపీలో పనిచేశారు. ఇద్దరికి మంచి స్నేహం ఉంది.
గతంలో ఓసారి బాలయ్య నటించిన సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లోనూ రేవంత్ రెడ్డి సందడి చేశారు. ఆ చనువుతోనే బాలయ్య అడిగిన వెంటనే రేవంత్ రెడ్డి ఓకే చేప్పినట్లు సమాచారం. అంతేకాదు.. అన్‌స్టాపబుల్ సీజన్-1, సీజన్-2లో చిరంజీవి వస్తారని చాలా ప్రచారం జరిగింది. కానీ అది కుదరలేదు. చివరకు ఈ నాలుగో సీజన్లో వస్తానని హామీ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే మెగా, నందమూరి అభిమానులకు పండగే అని చెప్పడంలో ఎలాంటి సందేహం ఉండదు. అన్‌స్టాపబుల్ వేదికగా బాలకృష్ణ, చిరంజీవి మల్టీస్టారర్ మూవీని అనౌన్స్ చేస్తారని మరో టాక్ వినిపిస్తోంది. ఈ వార్త తెలిసిన అభిమానులు రికార్డులన్నీ గల్లంతు కావడం ఖాయమని నెట్టింట్లో పోస్టులు పెట్టి రచ్చ చేస్తున్నారు.