Osmania: సాంబార్ గిన్నెతో రోడ్డెక్కిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు
హాస్టళ్లలో నాణ్యత లేని ఆహారం పెడుతున్నారని ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) విద్యార్థులు(Students) రోడ్డెక్కారు.
దిశ, వెబ్ డెస్క్: హాస్టళ్లలో నాణ్యత లేని ఆహారం పెడుతున్నారని ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) విద్యార్థులు(Students) రోడ్డెక్కారు. ఓయూలోని న్యూగోదావరి హాస్టల్(New Godavari Hostel) విద్యార్థులు ఇవాళ ఉదయం ఆర్ట్స్ కాళాశాల(Arts College) ఎదుట ఆందోళన నిర్వహించారు. యూనివర్సిటీ హాస్టళ్లలో నాణ్యత లేని ఆహారం(Poor Quality Food) అందిస్తున్నారని, చారు గిన్నెతో సహా రోడ్డుపై భైఠాయించారు. వీసీ(Osmania VC), వార్డెన్(Warden) స్పందించాలని డిమాండ్ చేస్తూ.. నినాదాలు చేశారు.
విద్యార్థులకు అందించే ఆహారం పూర్తిగా నాణ్యత లేకుండా ఉంటుందని, ఇలాంటి ఆహారం తిని అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉస్మానియా ఉన్నతాధికారులు(Osmania Officials) వెంటనే స్పందించి, చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం జరిగేలా చూడాలని విద్యార్థులు కోరారు. దీనిపై స్పందించిన చీఫ్ వార్డెన్ ఆందోళన చేపట్టిన విద్యార్థుల వద్దకు వచ్చారు. దీంతో విద్యార్థులు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసిన పట్టించుకోవడం లేదని వాగ్వాదానికి దిగారు. దీనిపై చీఫ్ వార్డెన్ స్పందిస్తూ.. ఇక నుంచి నాణ్యమైన ఆహారం అందించేలా చర్యలు చేపడతామని విద్యార్థులకు హామీ ఇచ్చి, ఆందోళన విరమించాలని కోరారు.