మధుయాష్కీ గౌడ్ ఇంటికి వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి
టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం పరామర్శించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం పరామర్శించారు. హయత్‌నగర్‌లోని మధుయాష్కి ఇంటికి చేరుకున్న సీఎం అనసూయమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు సీఎం సానుభూతిని తెలిపారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ తదితర నాయకులు అనసూయ చిత్రపటానికి నివాళులర్పించారు.
కాగా, మధుయాష్కీ తల్లి అనసూయమ్మ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఇటీవల ఆమె మరణించారు. ఇదిలా ఉండగా మరోవైపు ఎన్నికల ప్రచారంలో భాగంగా మధుయాష్కి గౌడ్ అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ బీజీగా ఉన్నారు.