బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి స్వీట్ వార్నింగ్
బీఆర్ఎస్ నేతలు తీరు మార్చుకోకుంటే ఈసారి ప్రతిపక్షంలోకి కాదు ప్రజలు బయకు పంపిస్తారన్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ నేతలు తీరు మార్చుకోకుంటే ఈసారి ప్రతిపక్షంలోకి కాదు ప్రజలు బయకు పంపిస్తారన్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రగతి భవన్ ఇనుప కంచెను బద్ధలు కొట్టి 4 కోట్లు ప్రజలకు ప్రవేశం కల్పించామని, గడీలు బద్దలు కొట్టి ప్రజావాణికి జనం క్యూ కడుతుంటే బీఆర్ఎస్ నేతలు భరించలేకపోతున్నారన్నారు. గవర్నర్ ప్రసంగానికి దన్యవాద తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి.. గతంలో ప్రగతి భవన్‌లోకి మంత్రులకు కూడా ప్రవేశం లేదని, హోంమంత్రిని ప్రగతి భవన్‌లోకి వెళ్లకుండా ఒక హోంగార్డు చేత అడ్డగించిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉందన్నారు. ప్రజాయుద్ధనౌక గద్దర్‌ను సైతం ప్రగతి భవన్ ముందు గంటల తరబడి ఎండలో నిలబెట్టారని, అమరవీరుల కుటుంబసభ్యులను ప్రగతి భవన్‌కు గత సీఎం ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు. కానీ ఇప్పుడు ఎవరు వచ్చినా ప్రజల సమస్యలు వినేందుకు ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
కుటుంబ పార్టీనే అని మరోసారి నిరూపించుకున్నారు :
బీఆర్ఎస్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తెలంగణ ప్రజలు తీర్పు ఇచ్చారని ఓటమి తర్వాతనేనా బీఆర్ఎస్‌లో మార్పు వస్తుందని ఆశించామని కానీ పార్టీలో ఎంతో మంది సీనియర్లు ఉన్నప్పటికీ వారిని కాదని ఒక కుటుంబ సభ్యులే మాట్లాడుతున్నారన్నారని సెటైర్ వేశారు. బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పాలనకే పరిమితమవుతుందని మరోసారి నిరూపించారన్నాని ఎద్దేవా చేశారు. నియంతృత్వానికే ఈ ప్రభుత్వం వెళ్ళాలనుకుంటే, గత ప్రభుత్వం లాగనే వ్యవహారించాలనుకుంటే ఇక్కడ ఇంత ఓపిగ్గా వినే పరిస్థితి ఉండేది కాదన్నారు. గతంలో ఇదే సభలో ప్రశ్నించినందుకు మా సభ్యులను మార్ష్స్‌తో బయటకు పంపించారు. ఇది గత ప్రభుత్వ ఘనకార్యం అన్నారు. బీఆర్ఎస్ పాలనలో నియంతృత్వ, నిరంకుశ పోకడలు అలా ఉండేవన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గవర్నర్ రంగరాజన్ ఉన్న్పపుడు ఎమ్మెల్యేలు చేసినంత గందరగోళంలో 10 శాతం కూడా కూడా మా సభ్యులు చేయకపోయినా సభ్యత్వాలను రద్దు చేసిన చీకటి రోజులు ఈ సభలోనే జరిగాయని ఈ చరిత్ర శాశ్వతంగా ఉండిపోతుందన్నారు.
మేనేజ్‌మెంట్ కోటాలో వస్తే ఇలాగే ఉంటుంది :
సభలో సీఎం ప్రసంగిస్తుండగా బీఆర్ఎస్ నేతలు రన్నింగ్ కామెంట్ చేయడంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మేనేజ్‌మెంట్ కోటాలో వస్తే ఇలా సభలో రన్నింగ్ కామెంటరీ ఉంటుందని, తట్టుకునే సహనం ఉండదన్నారు. చట్టాలను ఈ సభ చేస్తుంది. మంత్రివర్గంలో తీసుకున్న విధాన నిర్ణయాలకు చట్టబద్ధత కల్పించేది ఈ సభ. అందుకే రాబోయే రోజుల్లో మేం ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఏ రూపంలో చట్టబద్ధత కల్పించాలే ఇదే సభలో ప్రవేశపెట్టి ప్రతిపక్ష సభ్యుల అభిప్రాయాలను, సూచనలను పరిగణనలోకి తీసుకుని చట్టం చేస్తామన్నారు. ఈ తేడాను మేనేజ్‌మెంట్ కోటాలో వచ్చినవారు గమనించాలని సూచించారు.
Read More : మండుటెండలో గద్దరన్నను గేటు ఎదుట నిల్చోబెట్టారు: సీఎం రేవంత్