ఆ మహమ్మరిని కలిసి కట్టుగా ఎదుర్కోవాలి : సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం రాజేంద్ర నగర్లోని పోలీస్ అకాడమీలో 'పోలీస్ డ్యూటీ మీట్' ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Update: 2024-10-19 14:38 GMT

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం రాజేంద్ర నగర్లోని పోలీస్ అకాడమీలో 'పోలీస్ డ్యూటీ మీట్' ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రానికి డ్రగ్స్ మహమ్మారి పట్టుకుందని, దానిని తరిమివేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పొరుగు రాష్ట్రాల నుండి గంజాయి లాంటి మత్తు పదార్థాలు తెలంగాణలోకి రాకుండా పోలీసులు సరిహద్దులోనే అడ్డుకోవాలని సూచించారు. సైబర్ నేరాలు ఇటు పోలీసులకు, అటు ప్రజలకు పెను సవాల్ గా మారాయని అన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చి చూసుకుంటే సైబర్ నేరాలను అడ్డుకోవడంలో, బాదితుల సొమ్ము రికవరీలో మన రాష్ట్ర పోలీసులు చాలా బెటర్ గా పనిచేస్తున్నారని కొనియాడారు. సైబర్ నేరాల దర్యాప్తులో రాష్ట్ర పోలీసులకు జాతీయ అవార్డు వచ్చిందని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.  


Similar News