విజ్ఞాన్ భవన్ లో హోంమంత్రి అమిత్ షా సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి 8 రాష్ట్రాల సీఎంలు, హోంమంత్రులు, ఉన్నతాధికారులను ఆహ్వానించారు. ఈ వామపక్ష తీవ్రవాద ప్రభావిత (LWE) రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారుల సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్ లతో కలిసి పాల్గొన్నారు. కాగా ఈ సమావేశం అనంతరం పలు అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో హాజరుకానున్నట్లు తెలుస్తుంది. అలాగే ప్రధాని మోడీతో కూడా హాజరయ్యేందుకు అపాయింట్మెంట్ కోరినట్లు తెలుస్తోంది. ఒకవేళ ప్రధాని అపాయింట్మెంట్ దొరికితే.. వరదల నష్ట పరిహారం పెంపు, మూసీ సుందరీకరణ, ప్రక్షాళనకు సంబంధించిన నిధుల గురించి చర్చించనున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ ఈ సమావేశానికి బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల సీఎంలు, హోంశాఖ మంత్రులు హాజరుకాగా.. ఆంధ్రప్రదేశ్ నుంచి హోంమంత్రి అనిత, డీజీపీ లు హాజరయ్యారు.