నమాజ్ సమయంలో స్పీచ్ ఆపాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతున్న వంశీచంద్ రెడ్డిని నమాజ్ కారణంగా మాట్లాడకుండా స్పీచ్ ఆపించివేశారు.

Update: 2024-04-19 09:31 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతున్న వంశీచంద్ రెడ్డిని నమాజ్ కారణంగా మాట్లాడకుండా స్పీచ్ ఆపించివేశారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నా చల్లా వంశీచంద్ రెడ్డి ఇవ్వాళ నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. వంశీచంద్ రెడ్డితో పాటు రేవంత్ రెడ్డి ప్రచార రథంపైకి ఎక్కి స్పీచ్ ప్రారంభించారు. ఈ స్పీచ్ ఇస్తున్న సమయంలో నమాజ్ సమయం కావడంతో దగ్గరలోని మసీదు నుంచి నమాజ్ ప్రార్థనలు వినిపించాయి. రేవంత్ రెడ్డి నమాజ్ నడుస్తోంది స్పీచ్ ఆపాలని వంశీచంద్ రెడ్డికి సంజ్ఞ చేశారు. దీంతో వంశీచంద్ రెడ్డి హటాత్తుగా తన ప్రసంగాన్ని ఆపి, నినాదాలు చేయవద్దని కార్యకర్తలకు సూచించారు. నమాజ్ అయిపోయిన అనంతరం మళ్లీ వంశీచంద్ రెడ్డి ప్రసంగాన్ని కొనసాగించారు.

Read More...

స్టేట్‌వైడ్‌గా జోరుగా నామినేషన్ల ప్రక్రియ.. కరీంనగర్ కాంగ్రెస్‌లో మాత్రం డైలమా! 

Tags:    

Similar News