రైతు ఆత్మహత్యలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

రైతులు అప్పులు చేస్తే ప్రాణాలు తీసుకోవాలా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

Update: 2024-07-17 11:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: రైతులు అప్పులు చేస్తే ప్రాణాలు తీసుకోవాలా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్ ప్రజాభవన్‌లో నిర్వహించిన పీసీసీ కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డ మాట్లాడారు. రూ.వేల కోట్లు అప్పు చేసిన విజయ్ మాల్యా, నీరవ్ మోడీలాంటి వాళ్లు ప్రాణాలు తీసుకోరు అన్నారు. రైతులు ఆత్మహత్య చేసుకోవద్దని చెప్పడానికి రూ.2లక్షల రుణమాఫీ అన్నారు. రుణమాఫీపై గ్రామ, మండల, నియోజకవర్గం స్థాయిలో ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.

ఎన్నికల సమయంలో ఓట్లు అడగడానికి గ్రామాలకు వెళ్లామని.. ఇప్పుడు రుణమాఫీ చేశామని గ్రామాల్లో చెప్పండని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం రూ.లక్ష వరకు రుణాలు మాఫీ చేస్తామన్నారు. రూ.7వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లోకి వెళతాయి సీఎం అన్నారు. నెలాఖరులోగా రూ.లక్షన్నర వరకు రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. ఆగస్టులో రూ.2లక్షల వరకు రైతుల రుణాలు మాఫీ చేస్తామన్నారు. ప్రతీ రైతుకు రుణ విముక్తి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేయనివిధంగా రూ.30 వేల కోట్లతో రుణమాఫీ చేస్తున్నామని సీఎం రేవంత్ అన్నారు.


Similar News