KCR అసెంబ్లీకి రాకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
రాష్ట్ర ప్రతిపక్ష అసెంబ్లీకి రాకపోవడం కరెక్ట్ కాదని మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రతిపక్ష అసెంబ్లీకి రాకపోవడం కరెక్ట్ కాదని మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతనే అసెంబ్లీకి రాకపోతే ఇక ఆయన ఉండి ఎందుకని ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగానికి హాజరు కాలేదు. కనీసం సభలో చర్చలో కూడా పాల్గొనలేదు. ప్రతిపక్ష నేతగా సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. అంతేకానీ, ఇంట్లో కూర్చొని ప్రతిపక్ష నేత అని చెప్పుకోవడం సమంజసంగా లేదని మండిపడ్డారు.
రాష్ట్రంలో ప్రజా స్వామిక పాలన ఉండాలని అనేక మంది యువకులు, మేధావులు ఆత్మబలిదానం చేస్తే రాష్ట్రం వచ్చిందని గుర్తుచేశారు. ఏ ఒక్కరో తొడ కొట్టి, ఇంట్లో కూర్చొని డబ్బాలు కొట్టుకుంటే రాష్ట్రం రాలేదని ఎద్దేవా చేశారు. నిజాములకు, రజాకార్లకు వ్యతిరేకంగా నిటారుగా నిలబడి.. కొట్లాడి విముక్తి పొందిన రాష్ట్రమని గుర్తుచేశారు. ఇంతటి పోరాట చైతన్యమున్న రాష్ట్రంలో ప్రతిపక్ష నేత సభకు రాకపోవడం, ఓటమిని జీర్ణించుకోలేకపోవడం మంచిదికాదని అన్నారు. గత ప్రభుత్వం నిర్భంద పాలన చేపట్టిందని తెలిపారు. అందుకే ప్రజలు ఆ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా ఇచ్చారని అభిప్రాయపడ్డారు.
Also Read..
BREAKING: పీవీ నర్సింహారావుకు ‘భారతరత్న’.. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు