CM Revanth Reddy: కులగణనను ప్రభుత్వం బాధ్యతగా భావిస్తుంది.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
రాష్ట్రంలో కులగణన (Cast Census)ను ప్రభుత్వం బాధ్యతగా భావిస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కులగణన (Cast Census)ను ప్రభుత్వం బాధ్యతగా భావిస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ హైదరాబాద్‌లో కులగణన సర్వే అభిప్రాయ సేకరణ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాన్య ప్రజల నుంచి సూచనలు తీసుకోవడానికి రాహుల్‌గాంధీ (Rahul Gandhi) నేరుగా రాష్ట్రానికి రావడం గొప్ప విషయమని కొనియాడారు. కులగణన విషయంలో రాహుల్‌కు ఇచ్చిన మాట నెరవేర్చడమే తమ కర్తవ్యమని అన్నారు.
కులగణన మాటల్లో కాదు.. చేతల్లో చూపాలన్నదే ఆయన ఆలోచన అని తెలిపారు. ఈ నిర్ణయం తీసుకోవాలంటే గుండె ధైర్యం కావాలని సీఎం రేవంత్ కామెంట్ చేశారు. సామాజిక బాధ్యత, సమాన అవకాశాలు ఇవ్వాలన్న ఆలోచనతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. బీసీకు అందాల్సిన రిజర్వేషన్లు కులగణనతో అందిస్తామని స్పష్టం చేశారు. 2025లో చేపట్టబోయే జనగణనలో కులగణనను కూడా పరిగణలోకి తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.