పాలస్తీనా సంఘీభావ సభకు సీఎం రేవంత్ రెడ్డి!

ఈ నెల 4వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ‘పాలస్తీనా సంఘీభావ సభ’కు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు.

Update: 2024-02-02 15:45 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఈ నెల 4వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ‘పాలస్తీనా సంఘీభావ సభ’కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం సాయంత్రం 6 గంటలకు జరిగే ఈ సభకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా పాల్గొంటారని వెల్లడించారు.

ఈ సభకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించగా, సానుకూలంగా స్పందించారని ఇవాళ ఓ ప్రకటన చేశారు. పాలస్తీనాలో ఇజ్రాయెల్ మారణహోమం సాగిస్తోందని, ఈ నేపథ్యంలో పాలస్తీనా పౌరులకు ప్రపంచమంతా అండగా ఉన్నదని తెలిపారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పాలస్తీనా సంఘీభావ సభను సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు కూనంనేని పేర్కొన్నారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..