Delhi : నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. ఫాక్స్‌కాన్‌ - యాపిల్‌ కంపెనీ ప్రతినిధులతో భేటీ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇవాళ రుణమాఫీ ఫైనల్ ఫేజ్‌ను ప్రారంభించిన అనంతరం రాత్రి హస్తీనాకు బయలుదేరుతారు.

Update: 2024-08-15 08:25 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇవాళ రుణమాఫీ ఫైనల్ ఫేజ్‌ను ప్రారంభించిన అనంతరం రాత్రి హస్తీనాకు బయలుదేరుతారు. అయితే, సీఎం రెండు, మూడు రోజులు ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా ఫాక్స్‌కాన్‌ - యాపిల్‌ కంపెనీ ప్రతినిధులతో సీఎం భేటీ కానున్నట్లు తెలిసింది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు మంత్రి శ్రీధర్‌బాబు శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారని సమాచారం. మరోవైపు శుక్రవారం కాంగ్రెస్ హైకమాండ్‌తో రేవంత్ భేటీ కానున్నారు.

రైతులకు రుణమాఫీ ఆగస్టు 15తో పూర్తి చేయడంతో.. వరంగల్లో నిర్వహించాలని అనుకుంటున్న రైతు కృతజ్ఞత సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించనున్నారు. అదేవిధంగా సచివాలయం ఎదురుగా రాజీవ్‌గాంధీ విగ్రహం ఓపెనింగ్ కార్యక్రమానికి రేవంత్ సోనియాను ఆహ్వానించనున్నారు. ముఖ్యంగా తెలంగాణ నూతన పీసీసీ చీఫ్, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టులపై ఏఐసీసీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ, కేసీ వేణుగోపాల్‌తో చర్చించనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..