రైతు రుణమాఫీ సంబురం.. స్వయంగా వరినాట్లు వేసిన సీఎం రేవంత్ రెడ్డి (వీడియో)

నేడు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ సర్కారు రూ.లక్షలోపు రైతు రుణమాఫీ ఇంప్లిమెంట్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది.

Update: 2024-07-18 07:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: నేడు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ సర్కారు రూ.లక్షలోపు రైతు రుణమాఫీ ఇంప్లిమెంట్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. సాయంత్రం 4గంటలకు రుణమాఫీ ప్రక్రియను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో మొత్తం 11.50లక్షల మందికి రైతు రుణ ఖాతాల్లోకి నిధులు జమ కానున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క ట్విట్టర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి ఆసక్తికర ట్వీట్ చేశారు. సీఎం రేవంత్ స్వయంగా వరినాట్లు వేస్తున్న పాత వీడియోను షేర్ చేశారు.

తెలంగాణ యాసతో వచ్చిన ‘బలగం’ సినిమాలోని ‘ఊరు పల్లెటూరు’ పాటతో ఎడిట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి వీడియోను సీతక్క షేర్ చేసి.. ‘రైతు రుణమాఫీ సంబురం.. రాష్ట్రమంతా పండుగ వాతావరణం’ అని కామెంట్ పెట్టారు. తొలుత రైతులను ఆప్యాయంగా పలకరించిన రేవంత్ రెడ్డి తలకు ఆకుపచ్చ కండువాను కట్టునున్నారు. అనంతరం ‘అన్న రా.. నాట్లు వేద్దామని మహిళా రైతులు పిలవడంతో పొలంలోకి దిగి.. వరి నాట్లు వేసి సందడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Tags:    

Similar News