CM Revanth: సొంత పార్టీలో సీఎంకు ఫుల్ సపోర్ట్.. హైడ్రా నిర్ణయంపై ఎమ్మెల్యేల ప్రశంసలు

అక్రమ నిర్మాణాల కూల్చివేసి, చెరువులు, కుంటలను రక్షించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన హైడ్రాపై సొంత పార్టీ నుంచి ఇబ్బందులు వస్తాయని భావించిన రేవంత్‌‌రెడ్డికి అనూహ్యంగా పెద్దఎత్తున మద్దతు వస్తుంది.

Update: 2024-08-27 03:10 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: అక్రమ నిర్మాణాల కూల్చివేసి, చెరువులు, కుంటలను రక్షించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన హైడ్రాపై సొంత పార్టీ నుంచి ఇబ్బందులు వస్తాయని భావించిన రేవంత్‌‌రెడ్డికి అనూహ్యంగా పెద్దఎత్తున మద్దతు వస్తుంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు సీఎం నిర్ణయాన్ని స్వాగించారు. హైడ్రాను రాష్ట్రమంతటా విస్తరించాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే సీఎంని అభినందిస్తూ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, విప్ అడ్లూరి లక్ష్మణ్ లేఖ రాశారు. ఇప్పటికే ఇతర పార్టీలకు చెందిన పలువురు నేతలు సైతం హైడ్రాను సమర్థించారు.

ఎమ్మెల్యేల వినతులు ఇలా..

  • రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ తరహా వ్యవస్థ కోసం సీఏంకు విప్ ఆది శ్రీనివాస్ లేఖ రాశారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రమేశ్ బాబు వేములవాడలో ఎఫ్టీఎల్ పరిధిలో గెస్ట్‌‌హౌస్‌ కట్టారని ప్రస్తావించారు.
  • తన నియోజకవర్గంలో హైడ్రాను విస్తరించాలని సీఎం రేవంత్‌రెడ్డికి షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ విన్నవించారు.
  • నకిరేకల్ నియోజకవర్గంలోనూ ఆక్రమణకు గురైన భూములను కాపాడాలని, దీనిపై ముఖ్యమంత్రికి లేఖ రాస్తానని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు.
  • ఆలేరు నియోజకవర్గంలో ఆక్రమణకు గురైన భూములు, అక్రమ కట్టడాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని సీఎంకు విప్ బీర్ల ఐలయ్య లెటCM Revanth: సొంత పార్టీలో సీఎంకు ఫుల్ సపోర్ట్.. హైడ్రా నిర్ణయంపై ఎమ్మెల్యేల ప్రశంసలుర్ రాశారు.
  • తమ నియోజకవర్గాల్లో హైడ్రా లాంటి వ్యవస్థ ఏర్పాటు చేయాలని మానుకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య కోరారు.

Similar News