CM Revanth: తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్పుపై అసెంబ్లీలో చర్చ.. సీఎం రేవంత్ కీలక ప్రాతిపాదన

అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా చివరి రోజు పలు బిల్లులపై వాడీవేడిగా చర్చ కొనసాగుతోంది.

Update: 2024-08-02 07:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా చివరి రోజు పలు బిల్లులపై వాడీవేడిగా చర్చ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం పేరు మార్పును సభలో సీఎం రేవంత్‌‌రెడ్డి లేవనెత్తారు. ఈ మేరకు తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప‌రెడ్డి పేరును పెట్టాలని ప్రతిపాదించారు. తెలంగాణ రాష్ట్ర విముక్తిలో సురవరం పాత్రను ప్రభుత్వం కీర్తిస్తుందని అన్నారు. అందరూ అంగీకరిస్తే.. తెలుగు విశ్వ విద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టేందుకు ఎలాంటి అభ్యతరం లేదన్నారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..