CM Revanth: అరెకపూడి ఇంటి ముట్టడికి సిద్ధమవుతోన్న బీఆర్ఎస్ శ్రేణులు.. డీజీపీకి సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, అరెకపూడి గాంధీల మధ్య పంచాయితీ రాష్ట్రంలో పొలిటికల్ హీట్‌ను పుట్టిస్తున్నాయి.

Update: 2024-09-13 04:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, అరెకపూడి గాంధీల మధ్య పంచాయితీ రాష్ట్రంలో పొలిటికల్ హీట్‌ను పుట్టిస్తోంది. గురువారం కౌశిక్‌రెడ్డి ఇంటికి అరెకపూడి గాంధీ వెళ్లగా ఇరు పార్టీ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. ఓ దశలో పరస్పరం టమాటాలు, కోడిగుడ్లు, చెప్పులు కూడా విసుకున్నారు. హరీశ్‌రావు అరెస్ట్‌తో అర్ధరాత్రి వరకు బీఆర్ఎస్ నాయకులు నిరసనలు చేపట్టారు. శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఇంటిని ముట్టడిస్తామని బీఆర్ఎస్ స్టేట్‌మెంట్ ఇవ్వడంతో తాజా పరిణామాలపై సీఎం రేవంత్‌రెడ్డి ఆరా తీశారు. అదేవిధంగా డీజీపీ జితేందర్‌కు కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఎట్టి పరిస్థితుల్లో శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాజకీయ కుట్రలను ఏమాత్రం సహించేది లేదని అన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసే పనిలో బీఆర్ఎస్ ఉందని ఆరోపించారు. ముఖ్యంగా రెచ్చగొట్టి గొడవలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అయితే, ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్టులకు నిరసనగా హైదరాబాద్ వెళ్లేందుకు గులాబీ శ్రేణులు సిద్ధం కాగా.. ఉమ్మడి కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో నేతలందరిని పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు.  


Similar News